సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'పుష్ప' షూటింగులో చేరిన అనసూయ
- దూసుకుపోతున్న 'అఖండ' టీజర్
- షూటింగుకి రెడీ అవుతున్న వరుణ్ తేజ్
* బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'అఖండ' సినిమా టీజర్ యూ ట్యూబ్ లో దూసుకుపోతోంది. ఉగాది నాడు రిలీజైన ఈ టీజర్ కి ఇప్పటివరకు 32 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం అన్నది పెద్ద విశేషం. ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయన్నది దీనిని బట్టి అర్థమవుతోంది.
* వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'గని' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును త్వరలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ, ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఇందులో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.