ప్రభాస్ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. ఆగిపోయిన షూటింగ్!
- అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్'
- ప్రభాస్ మేకప్ మేన్ కు కరోనా
- మేకప్ మేన్ తిరిగి రావడం కోసం ఎదురుచూస్తున్న చిత్ర యూనిట్
మరోవైపు ఈ సినిమా షూటింగ్ పై కరోనా ప్రభావం పడింది. ప్రభాస్ మేకప్ మేన్ కరోనా బారిన పడటంతో షూటింగ్ ఆగిపోయిందని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పాత తరం లుక్ లో కనిపించాలి. దీనికి మేకప్ చాలా ముఖ్యం. అయితే, మేకప్ మేన్ కు కరోనా సోకడంతో షూటింగ్ నిలిచిపోయింది. మేకప్ మేన్ తిరిగా రావడం కోసం యూనిట్ ఎదురుచూస్తోంది.
మరోవైపు ఈ సినిమాలో భాగ్యశ్రీ, సచిన్ ఖడేకర్, మురళీశర్మ, కృనాల్ రాయ్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్టంరాజు కీలక పాత్రను పోషిస్తున్నారు.