వైభవంగా భద్రాద్రి రామయ్య కల్యాణం.. స్వామి వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ

Sita Rama Kalyanam In Bhadrachalam Temple
  • గత రాత్రి వైభవంగా జరిగిన ఎదుర్కోలు ఉత్సవం
  • హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు
  • కొవిడ్ నేపథ్యంలో భక్తులకు లేని అనుమతి
నేడు శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే, కొవిడ్ నేపథ్యంలో భక్తులు లేకుండానే ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలకు మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు హాజరయ్యారు.

కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి ‘ఎదుర్కోలు’ ఉత్సవాన్ని నిర్వహించారు. అర్చకుల్లో కొందరు రాముడి తరపున, మరికొందరు సీతమ్మ తరపున ప్రతినిధులుగా వ్యవహరించి ఉత్సవాన్ని నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దంపతులతోపాటు పలువురు అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.
Go Back to Shorts
Bhadrachalam
Lord Sri Rama
Sita Rama Kalyanam

More Telugu News