Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థాంక్యూ జగన్ గారూ.... బర్త్ డే విషెస్ తెలిపిన సీఎంకు చంద్రబాబు కృతజ్ఞతలు

Chandrababu thanked CM Jagan
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
  • దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు ట్వీట్
  • వెంటనే బదులిచ్చిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 72వ పడిలో అడుగుపెడుతున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ సీనియర్ రాజకీయ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుడి ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అటు, చంద్రబాబు కూడా అంతే గౌరవంతో స్పందించారు. 'థాంక్యూ వెరీ మచ్ జగన్ గారూ' అంటూ బదులిచ్చారు.
Chandrababu
Jagan
Wishes
Birthday
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News