చెల్లీ అని అంటూనే బాలికపై టిక్​ టాక్​ స్టార్​ భార్గవ్​ అఘాయిత్యం!

Fun Bucket Bhargav Arrested in Minor Rape Case
టిక్ టాక్ వీడియోల పేరుతో బాలికపై అత్యాచారం చేసిన కేసులో టిక్ టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. చెల్లి అని పిలుస్తూనే 14 ఏళ్ల ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు భార్గవ్ పై ఆ బాలిక తల్లి ఆరోపణలు చేస్తోంది. విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ ఫిర్యాదు ఆధారంగా భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతున్నారు.

విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్.. టిక్ టాక్ తో మంచి పేరు  సంపాదించాడు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. టిక్ టాక్ వీడియోలపై ఆ బాలికకూ ఆసక్తి ఉండడంతో తరచూ మాట్లాడుకునేవారు. ఆ పరిచయంతో భార్గవ్ ను అన్నయ్య అని ఆ బాలిక పిలిచేది. చాటింగ్ చేయడంతో పాటు వారిద్దరూ తరచూ కలుసుకునేవారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇటీవల బాలికలో వస్తున్న మార్పులను గమనించిన ఆమె తల్లి.. డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. దీంతో ఆ బాలిక నాలుగు నెలల గర్భిణీ అని తేలింది. బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించిందని, వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెబుతున్నారు. విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. భార్గవ్ ను రిమాండ్ కు తరలించినట్టు సమాచారం. అయితే, తాను చేసిన తప్పును భార్గవ్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని శివ అనే యాంకర్ సైతం తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. 2 లక్షలిస్తాం కేసు వాపస్ తీసుకోండి అంటూ పోలీసులను భార్గవ్ వేడుకున్నట్టు శివ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అతడి ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారని పేర్కొన్నాడు. అయితే, తన పాప్యులారిటీని పెంచుకోవడానికే శివ ఇదంతా చేస్తున్నాడా? అని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడంతో.. శివ దానిపై స్పష్టతనిచ్చాడు.

వ్యూస్ కోసం చేస్తున్నది కాదని తేల్చి చెప్పాడు. కేసును ఎక్కడ నీరుగారుస్తారోనన్న భయంతోనే బయటకు చెప్పానన్నాడు. ఇది ప్రాంక్ కానేకాదని, నిజమైన వార్తేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అతడి వరుస పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
TikTok
Fun Bucket
Fun Bucket Bhargav
Rape
Vizag
Andhra Pradesh

More Telugu News