చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
- నేడు చంద్రబాబు పుట్టినరోజు
- నేటితో 71 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు
- నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలన్న సీఎం జగన్
- టీడీపీ ఆఫీసులోనూ చంద్రబాబు జన్మదిన వేడుకలు
అటు, చంద్రబాబు జన్మదినం సందర్భంగా అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలోనూ, విజయవాడలోని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆఫీసులోనూ వేడుకలు నిర్వహించారు. పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, టీడీ జనార్దన్, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పార్టీ నేత నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.