ఆ ఐదు సిటీల్లో లాక్ డౌన్ అవసరం లేదు: అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
- ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట
- ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని సర్కార్ కు ఆదేశం
- వారంలో హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు
ఆ పిటిషిన్ ను మంగళవారం విచారించిన ధర్మాసనం.. లాక్ డౌన్ అవసరం లేదని పేర్కొంది. అదే సమయంలో మహమ్మారి కట్టడికి ఏ చర్యలు తీసుకున్నారో హైకోర్టుకు వివరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారంలోగా నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా అని లాక్ డౌన్ విధిస్తే.. ప్రజల జీవితాలపై పెను ప్రభావం పడుతుందని యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.