కృష్ణా ట్రైబ్యునల్ లో జరగాల్సిన విచారణ కరోనా కారణంగా వాయిదా
- తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
- ఈ నెల 28 నుంచి 30 వరకు విచారణ
- కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన ట్రైబ్యునల్
- ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయన్న చైర్మన్
- తదుపరి విచారణ తేదీలు త్వరలో నిర్ణయిస్తామని వెల్లడి
ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ట్రైబ్యునల్ చైర్మన్ లేఖ ద్వారా సమాచారం అందించారు. కరోనా నేపథ్యంలో విచారణ ఇప్పుడు వద్దని రెండు రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని, ఆ విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నామని చైర్మన్ పేర్కొన్నారు. తదుపరి విచారణ తేదీలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయిస్తామని వెల్లడించారు.