Shankar: దిల్ రాజు నుంచి భారీ పారితోషికం అందుకోనున్న శంకర్!

Shankar taking huge remuneration for Charan movie
షార్ట్స్‌లో చూడండి
దక్షిణాది సినిమాను ప్రపంచపటం వైపు పరుగులు తీయించిన దర్శకుడు శంకర్. పాన్ ఇండియా అనే పదం వినిపించక ముందే, ఆ తరహా సినిమాలను అందించిన ఘనత ఆయన సొంతం. ఆయన కథలు పలచబడవు .. ఆయన సినిమాల్లోని పాటలు పాతబడవు. మారుతున్న ట్రెండును అవి వెంటాడుతూనే ఉంటాయి .. అదీ ఆయన ప్రత్యేకత. ఆసక్తికరమైన కథకు .. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతవరకూ మిక్స్ చేయాలనే విషయం ఆయనకి బాగా తెలుసు.

అలాంటి శంకర్ ఒక వైపున 'ఇండియన్ 2' సెట్స్ పై ఉండగానే, మరో వైపున చరణ్ సినిమాను అంగీకరించడం విశేషం. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ కథానాయకుడిగా నటించనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అంతేకాదు ఈ స్థాయి దర్శకుడితో ఆయన చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే. ఒక నిర్మాతగా దర్శకుడికి అత్యధిక పారితోషికం చెల్లిస్తుండటమనేది కూడా ఈ సినిమాతోనే జరుగుతోంది. ఇక శంకర్ నేరుగా తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇంకా ఈ ప్రాజెక్టులో ఎన్ని విశేషాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Go Back to Shorts
Shankar
Dil Raju
Charan
Pan India Movie

More Telugu News