చంద్రబాబు సభపై రాళ్ల దాడి నేపథ్యంలో గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన టీడీపీ నేతలు
- తిరుపతిలో చంద్రబాబు రోడ్ షో
- రాళ్లు విసిరిన దుండగులు
- చంద్రబాబు ప్రచార వాహనంపైనా రాళ్లదాడికి యత్నం
- ఘటనలను గవర్నర్ కు వివరించాలని టీడీపీ నేతల యత్నం
జడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ చంద్రబాబుపై తిరుపతిలో రాళ్లదాడికి యత్నించడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు చంద్రబాబు భద్రతపైనా తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కోరనున్నారు. రాళ్లదాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరనున్నారు.