Gun: తుపాకిని బీరువాలో పెట్టమని ఇచ్చిన హోంగార్డు.. మిస్‌ఫైర్ కావడంతో భార్య మృతి

Home Guard wife killed as Gun Misfires
  • విజయవాడలోని గొల్లపూడిలో ఘటన
  • ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్ కుమార్
  • అక్కడికక్కడే మృతి చెందిన హోంగార్డు భార్య
తుపాకిని బీరువాలో భద్రపరచమని భార్యకు ఇవ్వగా, అది కాస్తా మిస్‌ఫైర్ అయి ఆమె మృతి చెందిన ఘటన విజయవాడలోని గొల్లపూడిలో జరిగింది. హోంగార్డు అయిన వినోద్‌కుమార్ ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వస్తూ తుపాకి తీసుకొచ్చాడు.

అనంతరం దానిని బీరువాలో భద్రపరచమని భార్య సూర్యరత్న ప్రభకు ఇచ్చాడు. ఆమె దానిని బీరువాలో పెట్టే సమయంలో ప్రమాదవశాత్తు మిస్‌పైర్ అయి తూటా ఆమె దేహంలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gun
Vijayawada
Home Gaurd
Misfire

More Telugu News