Axis Bank: యాక్సిస్ బ్యాంకు నుంచి రూ. 4.04 కోట్లతో పరారైన సెక్యూరిటీ గార్డు

Guard flees with Rs 4 crore from Axis Banks office in Chandigarh
  • చండీగఢ్‌లోని సెక్టార్ 34ఎలో ఘటన
  • ఏటీఎంకు తరలించేందుకు డబ్బు సిద్ధం చేసిన బ్యాంకు
  • ఓ పెట్టె తీసుకుని పరారైన సెక్యూరిటీ గార్డు
యాక్సిస్ బ్యాంకు బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు రూ. 4.04 కోట్లతో పరారైన ఘటన చండీగఢ్‌లోని సెక్టార్ 34ఎలో జరిగింది. నిన్న ఉదయం ఈ ఘటన జరగ్గా సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు నుంచి రూ. 4.04 కోట్ల నగదు మాయమైందని, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి దీనిని పట్టుకుపోయినట్టుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఏటీఎంలలో నగదు పెట్టేందుకు అధికారులు పెట్టెల్లో డబ్బులు సిద్ధం చేశారు. గమనించిన సెక్యూరిటీ గార్డు సుమీత్ అందులో ఓ పెట్టె తీసుకుని పరారైనట్టు పోలీసులు తెలిపారు. అతడు పెట్టెతో పరారవుతున్న దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడు మొహాలీలోని సోహానాకు చెందిన వాడని పోలీసులు తెలిపారు.
Axis Bank
Chanidgarh
Security Gaurd

More Telugu News