India: దేశంలో ఒక్క‌ రోజులో 1,52,879 మందికి కరోనా

India reports 152879 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. మొన్న ఒక్క రోజులో 1,45,384  మందికి కరోనా సోక‌గా, నిన్న  కొత్త‌గా 1,52,879 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 90,584 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,58,805 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 839 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,69,275కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,20,81,443  మంది కోలుకున్నారు. 11,08,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,15,95,147 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 25,66,26,850 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,12,047 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
India
Corona Virus
COVID19

More Telugu News