నన్ను ఏమీ చేయలేని చంద్రబాబు అకారణంగా నా కొడుకు ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టాడు: మంత్రి పెద్దిరెడ్డి
- చంద్రబాబుపై పెద్దిరెడ్డి విమర్శలు
- విద్యార్థి దశ నుంచి చంద్రబాబుతో పోరాడుతున్నట్టు వెల్లడి
- చంద్రబాబు పిరికిపంద అని వ్యాఖ్యలు
- ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం
"చంద్రబాబు నన్ను ఏమీ చేయలేక గతంలో నా కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని అకారణంగా జైలు పాలు చేశాడు" అని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు కనీసం ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను కూడా నియమించుకోలేని దుస్థితికి దిగజారిపోయాడని వ్యాఖ్యానించారు.