కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
- తెలంగాణలో కరోనా ఉద్ధృతి
- మూతపడిన విద్యాసంస్థలు
- దిగజారిన ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి
- ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
- నెలకు రూ.2 వేల సాయం..పాతిక కిలోల బియ్యం
సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 1.45 లక్షల మంది ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి లబ్ది చేకూరనుంది. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కరోనా దృష్ట్యా ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని ఆదుకోవాలనే సాయం చేస్తున్నామని చెప్పారు. టీచర్లు, సిబ్బంది తమ జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.