హైదరాబాద్ ను పలకరించిన చిరు జల్లులు!
- రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం
- తగ్గిన ఉష్ణోగ్రతలు
- నేడు, రేపు కూడా వర్షాలకు అవకాశం
దీంతో నిత్యమూ రాత్రిపూట నమోదయ్యే సగటు ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల మేరకు తగ్గాయి. తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసిన సంగతి తెలిసిందే. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే ఈ చిరు జల్లులకు అవకాశం ఏర్పడిందని, కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.