'మా' క్రమశిక్షణ సంఘం బాధ్యతలు ఇక వద్దు... రాజీనామా చేసిన మెగాస్టార్ చిరంజీవి!
- 2019లో నరేశ్ అధ్యక్షతన కమిటీ
- ఆపై కొత్త కమిటీలో కృష్ణంరాజు, చిరంజీవి తదితరులు
- ఎన్నికలకు సమయం దగ్గర పడినందున రాజీనామా
'మా'లో విభేదాలు తొలగకముందే కరోనా వెలుగులోకి రాగా, అప్పటి నుంచి అన్ని రకాల సినిమా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కొవిడ్ ప్రభావం నుంచి బయట పడుతోంది. మరోవైపు 'మా' తదుపరి ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే చిరంజీవి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.