Corona Virus: దేశంలో తొలిసారి ఒక్క‌రోజులో ల‌క్ష మందికిపైగా క‌రోనా నిర్ధార‌ణ‌

 India reports 103558 new  COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో పెరిగిపోతున్నాయి. దేశంలో తొలిసారి క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష దాటింది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 17న‌ దేశంలో గ‌రిష్ఠంగా 97,894 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు దాటి గ‌త 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా నిర్ధారణ అయింది.

వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 52,847 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 478 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,65,101కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,16,82,136 మంది కోలుకున్నారు. 7,41,830  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,91,05,163 మందికి వ్యాక్సిన్లు వేశారు.
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,90,19,657 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,93,749 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News