తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఐసెట్ కంట్రోలర్ మహేందర్ రెడ్డి నోటిఫికేషన్ ను మీడియాకు విడుదల చేశారు. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.250 జరిమానాతో జూన్ 30 వరకు, రూ.500 జరిమానాతో జూలై 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 13 నుంచి నిర్దేశిత వెబ్ సైట్ (https://icet.tsche.ac.in) ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఐసెట్ ను ఈసారి కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.


More Telugu News