India: దేశంలో ఒక్క‌రోజులో 89,129 మందికి కరోనా.. 714 మంది మృతి

India reports 89129 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా విజృంభ‌ణ రోజురోజుకీ ఉద్ధృత‌మ‌వుతోంది. గ‌త 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 44,202 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 714 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,64,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,15,69,241 మంది కోలుకున్నారు. 6,58,909 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,30,54,295 మందికి వ్యాక్సిన్లు వేశారు.
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,69,59,192 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,46,605 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
India
Corona Virus
COVID19

More Telugu News