రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు.. తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

  • తమిళనాడులో ఘటన
  • రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న యువకుడు 
  • ప్రాణాపాయం తప్పిందని తెలసి సంతోషం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెద్దమనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్న యువకుడిని గవర్నర్ తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించి అతడి ప్రాణాలు నిలిపారు. చెన్నై శివారులోని తండలంలో నిర్మించిన మురుగన్ ఆలయంలో నిర్వహించతలపెట్టిన ప్రథమ కుంభాభిషేకంలో పాల్గొనేందుకు తమిళిసై బయలుదేరారు.

మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి సొమ్మసిల్లి పడిన ఓ యువకుడు ఆమె దృష్టిలో పడ్డాడు. వెంటనే కాన్వాయ్ ను ఆపిన గవర్నర్.. తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులకు ఫోన్ చేసి యువకుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పడంతో తమిళిసై సంతోషం వ్యక్తం చేశారు.

Tamilisai Soundararajan
Telangana
Tamil Nadu

More Telugu News