తిరుపతిలో 3న జనసేనాని పాదయాత్ర

  • ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు పాదయాత్ర
  • ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగం
  • రెండో విడతలో నెల్లూరు జిల్లాలో పర్యటన
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వచ్చే నెల 3న తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 3న తిరుపతిలోని ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు జరిగే పాదయాత్రలో పవన్ పాల్గొంటారని తెలిపారు.

అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అలాగే, పవన్ రెండో విడతలో నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని మనోహర్ తెలిపారు.

Pawan Kalyan
Tirupati LS Bypolls
BJP
Ratna Prabha

More Telugu News