Nitya Menon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Nitya Meenan considered to be cast opposite Pawan kalyan
  • పవన్ కల్యాణ్ రీమేక్ లో నిత్యా మీనన్ 
  • కర్ణాటక ఫారెస్టులో బాలయ్య షూటింగ్
  • 'గల్లీబాయ్'గా మారిన 'బేబీ రౌడీ' టైటిల్  
*  పవన్ కల్యాణ్ నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రంలో కథానాయిక విషయంలో తాజాగా మరో పేరు వినిపిస్తోంది. ప్రముఖ నటి నిత్యా మీనన్ ఇందులో పవన్ సరసన కథానాయికగా నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇందులో మరో హీరోగా రానా నటిస్తుండగా, అతని సరసన ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోంది.
*  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న 'బీబీ3' చిత్రం  షూటింగ్ నిన్నటి నుంచి కర్ణాటకలోని దండేలి అడవుల్లో జరుగుతోంది. ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ షూటింగులో కొన్ని యాక్షన్ దృశ్యాలను అక్కడ చిత్రీకరిస్తారు. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. మే 28న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తారు.
*  సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'రౌడీ బేబీ' చిత్రం టైటిల్ని తాజాగా మార్చారు. దీనికి 'గల్లీ రౌడీ' అనే టైటిల్ని కొత్తగా నిర్ణయించినట్టు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.
Nitya Menon
Pawan Kalyan
Balakrishna
Pragya Jaiswal

More Telugu News