ఇక నిబంధనలు కఠినతరం... రైలులో సిగరెట్ తో పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష!
- రైలు టాయిలెట్ లో సిగరెట్ వేయడంతో మంటలు
- కీలక నిర్ణయాలు తీసుకున్న రైల్వే బోర్డు
- ఇకపై అలా కుదరదన్న ఉన్నతాధికారులు
రైల్లో సిగరెట్ తో పట్టుబడితే, మూడు సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. ఇదే సమయంలో మరో రూ.500 సెక్షన్ 165 కింద కట్టాల్సి వుంటుంది. సిగరెట్ కలిగివుండటాన్ని రైళ్లలో పేలుడు పదార్థాల రవాణా నిషేధ చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇక ప్యాంట్రీ కారు సహా రైల్లోని ఏ బోగీలోనూ సిగరెట్, బీడీ, చుట్ట వంటివి ఉండేందుకు వీల్లేదు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్త నిర్ణయాలపై వారం రోజుల పాటు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని బోర్డు ఆదేశాలు వెలువరించింది.