ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మైలాపల్లి శామ్యూల్?
- ఈ నెలాఖరుతో ముగియనున్న నిమ్మగడ్డ పదవీకాలం
- ముగ్గురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్న ప్రభుత్వం
- శామ్యూల్ కాకుంటే నీలం సాహ్ని!
నిజానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఐదేళ్లు, లేదంటే 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో ఉండొచ్చు. కానీ, శామ్యూల్ వయసు ప్రస్తుతం 67 ఏళ్లు. దీంతో ఎస్‌ఈసీ పదవిని ఆయనకు ఇచ్చేందుకు గవర్నర్ సానుకూలంగా లేకపోతే, అప్పుడు 65 ఏళ్ల లోపున్న నీలం సాహ్నికి ఆ పదవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వయసుతో పనిలేకుంటే కనుక శామ్యూల్‌కే ఆ పదవి దక్కే అవకాశం ఉంది.