దేశంలో కొత్త‌గా 40,715 మందికి కరోనా నిర్ధారణ

Media Bulletin on status of positive cases COVID19 in india
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796
  • మృతుల సంఖ్య 1,60,166
  • 4,84,94,594 మందికి వ్యాక్సిన్లు  
  • మొత్తం 23,54,13,233 కరోనా పరీక్షలు
దేశంలో  24 గంట‌ల్లో 40,715 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 29,785 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 199 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,81,253 మంది కోలుకున్నారు. 3,45,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,84,94,594 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,54,13,233 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,67,459 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News