నేను అమెరికా నుంచి ఢిల్లీ వస్తే... స్టీల్ ప్లాంట్ కార్మికులు నన్ను కలవకుండా విజయసాయిరెడ్డిని కలిశారు: కేఏ పాల్
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేఏ పాల్ స్పందన
- కార్మికుల కోసం అమెరికా నుంచి వచ్చానని వెల్లడి
- తననెవరూ పట్టించుకోవడంలేదని అసంతృప్తి
- కార్మికులు తనను కలిస్తే ఆమరణ దీక్ష చేపడతానని స్పష్టీకరణ
కార్మిక సంఘం నేతలు గనుక తనను కలిసి చర్చిస్తే, తాను వారి తరఫున ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని కేఏ పాల్ ప్రకటించారు. కార్మికుల కోసం తాను అమెరికా నుంచి వస్తే వారు తనను కలవకపోవడం బాధాకరమని అన్నారు. వారి కోసం ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.