20 రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల అమలు పూర్తి చేశాయి: కేంద్రం వెల్లడి
- దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాలు
- పూర్తి చేసిన రాష్ట్రాలకు అదనపు రుణాలు
- తాజాగా ఈ జాబితాలో 5 రాష్ట్రాలు
- రూ.39,521 కోట్ల రుణాలు పొందే అవకాశం
ఇప్పటివరకు దేశంలో 20 రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల అమలును పూర్తి చేశాయని వివరించింది. ఈ రాష్ట్రాలు బహిరంగ విపణి ద్వారా రూ.39,521 కోట్ల అదనపు రుణాలు స్వీకరించేందుకు అనుమతి దక్కించుకున్నాయని పేర్కొంది. ఈ అదనపు రుణాల శాతం రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తిలో 0.25 శాతం అని వివరించింది. ఈ రాష్ట్రాల జాబితాలోకి తాజాగా అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, గోవా, మేఘాలయ, త్రిపుర కూడా చేరాయని వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాలు ఇటీవల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల అమలును పూర్తి చేశాయని పేర్కొంది.