ఎంఎన్ఎం మేనిఫెస్టో విడుదల చేసిన కమలహాసన్... తమిళనాడును ట్రిలియన్ డాలర్ల రాష్ట్రంగా మార్చుతామని వెల్లడి
- తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హోరు
- ప్రజల తలసరి ఆదాయం పెంచుతామన్న కమల్
- మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తామని హామీ
- మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం
- యువతకు 50 లక్షల ఉద్యోగాలిస్తామన్న కమల్
తమిళనాడు ప్రజల ప్రస్తుత తలసరి ఆదాయం రూ.2.76 లక్షలు కాగా, దాన్ని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని తెలిపారు. మహిళలు ప్రతి నెలా రూ.15 వేల వరకు సంపాదించుకునేలా వారికి నైపుణ్య శిక్షణ ఇస్తామని, మహిళా సాధికారతకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. యువతకు 50 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు.