Nimmagadda Ramesh: నిమ్మగడ్డతో సమావేశమైన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

CS Adityanath Das meets Nimmagadda
  • పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోరిన సీఎస్
  • రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన వైనం
  • ప్రివిలేజ్ కమిటీ నోటీసుల ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా సమావేశమయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా నిమ్మగడ్డను వీరు కోరారు. రోజురోజుకూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తే నెలాఖరులోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చని చెప్పారు.

ఎన్నికలు ముగిస్తే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో నిమ్మగడ్డకు ఇచ్చిన ప్రివిలేజ్ కమిటీ నోటీసుల ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం. మరోవైపు రేపటి నుంచి 22 వరకు సెలవులో వెళ్లే యోచనలో నిమ్మగడ్డ ఉన్నారు.

More Telugu News

Nimmagadda Ramesh
CS
Adityanath Das