మోదీ ముఖ్య సలహాదారుడు సిన్హా రాజీనామా
- పీకే సిన్హా రాజీనామా చేశారని వెల్లడించిన ఓ అధికారి
- అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారన్న మరో అధికారి
- ఇంత వరకు ధ్రువీకరించని ఆయన కార్యాలయం
పీకే సిన్హా 1977 బ్యాచ్ కు చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత ఆయనకు కేబినెట్ సెక్రటరీగా సేవలందించారు. 2019లో రిటైర్ అయిన తర్వాత ఆయన కోసం ప్రధాని కార్యాలయంలో ఓఎస్డీ పేరుతో ప్రత్యేకంగా ఓ పదవిని సృష్టించడం గమనార్హం.