హెలికాప్టర్‌ కూడా ఇస్తామని హామీలు ఇస్తారు!: అన్నా డీఎంకే నేతలపై స్టాలిన్ సెటైర్

stalin slams aiadmk
  • జయలలిత మృతికి నేనే కార‌ణ‌మంటున్నారు
  • అదే నిజ‌మైతే నాపై కేసు పెట్టుకోవచ్చు
  • మా ఎన్నిక‌ల మేనిఫెస్టోను అన్నాడీఎంకే కాపీ కొట్టింది
  • ఈ ఎన్నిక‌ల్లో గెలుపు మాదే
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ముఖ్యమంత్రి పళనిస్వామి చేసిన ఆరోపణలపై డీఎంకే అధినేత‌ ఎంకే స్టాలిన్ మండిప‌డ్డారు. ఆమె మృతికి తానే కార‌ణ‌మంటున్నార‌ని, అదే నిజ‌మైతే తనపై కేసు పెట్టుకోవచ్చని స్టాలిన్ అన్నారు. ఆ కేసును తాను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.

త‌మ పార్టీ ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల మేనిఫెస్టోను కాపీ కొట్టి అన్నాడీఎంకే మేనిఫెస్టో ప్రకటించిందని ఆయ‌న విమ‌ర్శించారు. అన్నాడీఎంకే నేత‌లు విమానం, హెలికాప్టర్‌ కూడా ప్రతి ఒక్కరికీ ఇస్తామని ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీలు ఇస్తార‌ని, ఎందుకంటే ఎన్నికల్లో గెలవ‌ర‌ని వారికి కూడా బాగా తెలుసని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో గెలుపు తమదేనని ఆయ‌న ధీమా వ్యక్తం చేశారు. కాగా, త‌మిళ‌నాడులో కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకేలతో కలిసి డీఎంకే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంది.
Go Back to Shorts
stalin
aiadmk
Tamilnadu

More Telugu News