సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'ఇదొక ఛాలెంజ్' అంటున్న సమంత
- 'వకీల్ సాబ్' నుంచి మూడో పాట
- 'దృశ్యం 2'లో జాయిన్ అవుతున్న మీనా
* పవన్ కల్యాణ్ కథానాయకుడుగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న 'వకీల్ సాబ్' సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. మూడో పాటను రేపు (17న) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
* ఇటీవల మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. వెంకటేశ్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ రోజు కథానాయిక మీనా ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతోంది.