త్వరలో శీతలీకరణ, సూదులు గుచ్చే అవసరంలేని వ్యాక్సిన్లు వస్తున్నాయి: డబ్ల్యూహెచ్ఓ
- ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్
- కొత్తరకం టీకాలు వస్తున్నాయన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్టు
- వాటిని గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరచవచ్చని వెల్లడి
- ఆ వ్యాక్సిన్ల పనితీరు తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని వివరణ
ఈ వ్యాక్సిన్లకు సంబంధించి క్లినికల్ అధ్యయనాలు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరి నాటికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. అన్నీ కూలిస్తే ఈ ఏడాది చివరి కల్లా, లేకపోతే వచ్చే ఏడాది ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ వ్యాక్సిన్ల పనితీరు తమను అచ్చెరువొందిస్తోందని, వాటిని మరింత అభివృద్ధి చేస్తామని సౌమ్య స్వామినాథన్ వివరించారు.