అమెరికాలో జడలువిప్పిన తుపాకీ సంస్కృతి... షికాగోలో కాల్పుల మోత
- ఓ పార్టీలో తుపాకీ కాల్పులు
- రెండు వర్గాల మధ్య కాల్పులు
- ఇద్దరి మృతి, 13 మందికి గాయాలు
- ఏడుగురి పరిస్థితి విషమం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
సంఘటన స్థలం నుంచి షికాగో పోలీసులు నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది గ్యాంగ్ వార్ అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో షికాగో కూడా ఒకటి. ఇక్కడ 2020లో తుపాకీ కాల్పుల కారణంగా 760 మందికి పైగా మరణించారు.