National Media: ఏపీలో జగన్ రెడ్డి పార్టీ ఊపేసింది... నేషనల్ మీడియాలో కథనాలు

National media lauds Jagan over landslide victory in Municipal elections
  • ఏపీలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
  • మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ ప్రభంజనం
  • సీఎం జగన్ పథకాలే కారణమన్న జాతీయ మీడియా
  • కరోనా సమయంలోనూ పథకాలు అమలు చేసిన తీరుపై ప్రశంసలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. జగన్ రెడ్డి పార్టీ సునామీ లాంటి విజయం నమోదు చేసిందని పలు మీడియా సంస్థలు అభివర్ణించాయి. 75 మున్సిపాలిటీల్లో 74 వైసీపీనే కైవసం చేసుకుంటోందని, 12 కార్పొరేషన్లలోనూ వైసీపీదే విజయం అని ట్రెండ్స్ చెబుతున్నాయని పేర్కొంది. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఇప్పటికే ఏకగ్రీవం అయిందని, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీల్లోనూ ఏకగ్రీవం అయ్యాయని జాతీయ మీడియా పేర్కొంది.

సీఎం జగన్ తన రెండేళ్ల పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు వైసీపీకి విశేష ప్రజాదరణ అందించాయని వివరించింది. కరోనా సంక్షోభం సమయంలోనూ జగన్ పథకాలు అమలు చేసిన తీరు ఆయన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లిందని అభిప్రాయపడింది.
National Media
Jagan
YSRCP
Andhra Pradesh
Municipal Elections

More Telugu News