India: ఇంగ్లండ్ తో రెండో టీ20లో టీమిండియా టార్గెట్ 165 రన్స్... డకౌట్ అయిన రాహుల్

Second match between India and England at Motera stadium
  • అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20
  • మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగుల స్కోరు
  • రాణించిన జాసన్ రాయ్
  • సుందర్, ఠాకూర్ లకు చెరో రెండు వికెట్లు
టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ 46, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 28 పరుగులు చేశారు. మలాన్ 24, బెయిర్ స్టో 20 పరుగులు సాధించారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇక లక్ష్యఛేదనలో భారత్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. రాహుల్ పరుగులేమీ చేయకుండానే శామ్ కరన్ బౌలింగ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్ (11 బ్యాటింగ్), కెప్టెన్ విరాట్ కోహ్లీ (10 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 16 ఓవర్లలో 143 పరుగులు చేయాలి.
India
England
2nd T20
Ahmedabad

More Telugu News