అనంతపురం, చిత్తూరు కార్పొరేషన్లలో వైసీపీ జెండా రెపరెపలు
- ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం
- కార్పొరేషన్లలో దూకుడు
- తాజాగా మరికొన్ని కార్పొరేషన్లు వైసీపీ కైవసం
- ఒంగోలు, తిరుపతి కార్పొరేషన్లు వైసీపీ పరం
- మచిలీపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ఇక తిరుపతి కార్పొరేషన్ లోనూ ఇదే రీతిలో ఫలితాలు వచ్చాయి. తిరుపతి కార్పొరేషన్ లో 49 డివిజన్లు ఉండగా, వైసీపీ 48 గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీడీపీకి ఒక డివిజన్ దక్కింది. అటు, ఒంగోలు నగరపాలక సంస్థ కూడా వైసీపీ వశమైంది. మొత్తం 50 డివిజన్లలో వైసీపీ 41, టీడీపీ 6, జనసేన 1, ఇతరులు 2 స్థానాలు గెలుచుకున్నారు. మచిలీపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.