ఏపీ సర్కారు ముందుకొస్తే కేంద్రం స్టీల్‌ప్లాంట్ పై ఆలోచిస్తుంది: కిషన్ రెడ్డి
- స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర నిర్ణయాలు విధానపరమైనవే
- నష్టాల్లో కొనసాగుతోన్న పరిశ్రమను నడపడం భారం
- తమ పరిధిలోకి తీసుకోవడానికి ఏపీ సర్కారు ముందుకొస్తే ఆలోచిస్తాం
- ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా ఉంది
ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. నష్టాల్లో కొనసాగుతోన్న విశాఖ ఉక్కు పరిశ్రమను నడపడం భారమని చెప్పుకొచ్చారు. ఒక వేళ స్టీల్‌ప్లాంట్ ను తమ పరిధిలోకి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొస్తే ఆ విషయంపై కేంద్ర సర్కారు ఆలోచిస్తుందని తెలిపారు. ఉక్కు పరిశ్రమల కోసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు.