Corona Virus: దేశంలో మ‌ళ్లీ 25 వేలు దాటిన కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌

India reports 25320 new COVID19 cases
  • 24 గంటల్లో 25,320 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048
  • మృతుల సంఖ్య 1,58,607
  • 2,97,38,409 మందికి వ్యాక్సిన్లు  
దేశంలో కొత్త క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. కొత్త కేసుల సంఖ్య మ‌ళ్లీ 25 వేలు దాటింది. గత 24 గంటల్లో 25,320 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 16,637 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 161 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,607  కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,89,897 మంది కోలుకున్నారు. 2,10,544 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,97,38,409 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,67,03,641 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,64,368 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News

Corona Virus
COVID19
India