ఏపీలో గత 24 గంటల్లో 40,448 కరోనా పరీక్షలు... 175 మందికి పాజిటివ్
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 కేసులు
- కర్నూలు జిల్లాలో నిల్
- కరోనా నుంచి కోలుకున్న 132 మంది
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 1,268 మందికి చికిత్స
అదే సమయంలో 132 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకోగా, అనంతపురం జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో మరొకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,563కి చేరుకోగా... 8,83,113 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,268 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,182కి పెరిగింది.