సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'ఆదిపురుష్'కు కృతిసనన్ డేట్స్
- ఈద్ పండుగ సమయంలో విక్రమ్ కోబ్రా
- కార్తికేయ సినిమాకి సుకుమార్ కథ
* ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ తాజాగా 'కోబ్రా' చిత్రంలో నటిస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈద్ పండుగ సమయంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
* తాజాగా 'చావు కబురు చల్లగా' చిత్రంలో నటించిన హీరో కార్తికేయ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ బ్యానర్లో చేయనున్నాడు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలను కూడా సుకుమార్ సమకూరుస్తాడట. దర్శకుడు ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారు.