హారిక ఎవరో నాకు తెలియదు.. మరో సెలబ్రిటీని టూరిజానికి అంబాసిడర్‌గా నియమిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- హారిక నియామకంపై విచారణ చేయిస్తాం
- దీని వెనకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
- హారికను తొలగించారన్న వార్తను ఖండించిన పర్యాటక శాఖ చైర్మన్
మరోవైపు, పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను తొలగించారంటూ వస్తున్న వార్తను టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఖండించారు. తక్కువ ఖర్చుతో రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం చేసేందుకే హారికను ఎంపిక చేశామని చెప్పారు. పర్యాటక మంత్రి అనుమతితో టూరిజం బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మహేశ్ బాబు వంటి హీరోలతో ప్రచారం చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, హారికతో అయితే తక్కువ ఖర్చుతోనే ప్రచారం చేయించుకోవచ్చని తెలిపారు.