ఎన్నికల్లో లబ్ధి కోసం.. మమతా బెనర్జీ నాటకాలు ఆడుతున్నారు: కాంగ్రెస్

Mamata Banerjee is playing drama says Congress
  • నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారన్న మమత
  • ఆ సమయంలో తన పక్కన పోలీసులు కూడా లేరని వ్యాఖ్యలు
  • బెంగాల్ హోంమంత్రిత్వ శాఖ కూడా ఆమె వద్దే ఉందన్న కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనపై దాడి జరిగిందని చెపుతూ ప్రజల్లో సానుభూతిని పొందేందుకు యత్నిస్తున్నారని లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి విమర్శించారు.

నందిగ్రామ్ పర్యటనలో తనపై దాడి జరుగుతున్నప్పుడు పక్కన స్థానిక పోలీసులు కూడా లేరని మమత విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అధిర్ రంజన్ మాట్లాడుతూ, మమత వద్దే రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఉందని... అలాంటప్పుడు పక్కన పోలీసులు కూడా లేరని ఆమె చెపితే ఎలా నమ్మగలమని ఎద్దేవా చేశారు. మమత నాటకాలాడుతున్నారని బీజేపీ కూడా విమర్శించింది. తనపై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని మమత తెలిపిన విషయం తెలిసిందే. దాడిలో తన కాలికి గాయమయిందని ఆమె చెప్పారు.
Go Back to Shorts
Mamata Banerjee
TMC
Congress
Attack

More Telugu News