ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్
- త్రివేంద్ర సింగ్ నిన్న రాజీనామా
- పలు పేర్లు పరిశీలించి చివరికి తీరత్ ఎంపిక
- రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్ డిమాండ్
ఇప్పటివరకు ఈ రేసులో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రులు ధన్సింగ్ రావత్, సత్పాల్ మహరాజ్ సహా మరికొందరు నేతల పేర్లు వినపడ్డాయి. అయితే, పార్టీ శాసనపక్ష సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, తీరత్ సింగ్ రావత్ పేరును ఖరారు చేశారు.
మరోపక్క, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, అనంతరం ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.