ప్రచారంలో మమత జోరు.. టీ కాచి సర్వ్ చేసిన సీఎం
- రాష్ట్రంలో 8 విడతలుగా ఎన్నికలు
- నందిగ్రామ్‌లో టీ చేసిన అందరినీ ఆకర్షించిన సీఎం
- మమతకు ప్రత్యర్థిగా సువేందు అధికారి
మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉన్నారు. మమత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో 33 రోజులపాటు ఎన్నికలు జరగనున్నాయి.