తిరుమలలో ఐఆర్సీటీసీ కోటా... రైల్లో వెళితే సులువుగా దర్శనం!
- తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి టూర్ మొదలు
- రూ. 990తో తిరుమల, తిరుచానూరు దర్శనం
- ఏసీ వాహనాల్లో ప్రయాణం
ఉదయం 8 లోగా తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న భక్తులకు మాత్రమే ఈ ప్యాకేజీ. ఇందులో భాగంగా ఏసీ వాహనంలో తిరుమలకు తీసుకుని వెళ్లి, ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఇది మధ్యాహ్నం ఒంటిగంటలోపు పూర్తవుతుంది. రద్దీని బట్టి ఈ సమయం మారవచ్చు. ఆపై సొంత ఖర్చుతో భోజనం అనంతరం యాత్రికులను తిరుచానూరు తీసుకుని వెళ్లి అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి, తిరిగి రైల్వే స్టేషన్ కు చేరుస్తారు. ఇది ఒక రోజు ప్యాకేజీ అని, వసతి సౌకర్యాలు ఉండవని అధికారులు తెలిపారు.