రామమందిరం విరాళాల్లో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది: చంపత్ రాయ్
- అయోధ్యలో రామమందిరం నిర్మాణం
- జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ
- ఫిబ్రవరి 4 నాటికి రూ.2,500 కోట్ల విరాళాలు
- విరాళాల సేకరణ నిలిపివేస్తున్నట్టు ట్రస్టు ప్రకటన
- ఇకపై ఆన్ లైన్ లోనే విరాళాల అందజేత
దేశంలోని 4 లక్షల గ్రామాల్లో విరాళాల సేకరణ నిర్వహించామని, 9 లక్షల మంది కార్యకర్తలు విరాళాల సేకరణలో పాల్గొన్నారని వివరించారు. ఇంటింటికీ విరాళాల సేకరణను నిలిపివేశామని చంపత్ రాయ్ వెల్లడించారు. ఇకపై వెబ్ సైట్ ద్వారా మాత్రమే విరాళాల సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరో మూడేళ్లలో రామమందిరం నిర్మాణం జరుపుకుంటుందని పేర్కొన్నారు.