వాట్సాప్ లో ఫొటో చూసి పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయి... వరుడ్ని ప్రత్యక్షంగా చూసి పెళ్లికి నిరాకరణ
- బీహార్ లో ఘటన
- అనిల్ కుమార్ అనే యువకుడికి పెళ్లి నిశ్చయం
- అనిల్ ను ఫొటోలో చూసిన అమ్మాయి
- పెళ్లిమండపం వద్ద చూసి దిగ్భ్రాంతికి గురైన వైనం
- వివాహ వేదిక నుంచి పారిపోయిన వధువు
అయితే, మాంగల్యధారణ జరిగే సమయంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అప్పటివరకు పెళ్లికొడుకును ప్రత్యక్షంగా చూడని వధువు... పెళ్లికొడుకును తేరిపార చూసి దిగ్భ్రాంతికి గురైంది. పెళ్లికొడుకు ఫొటోలో చూసిన విధంగా లేడంటూ అక్కడ్నించి పారిపోయింది. కుటుంబసభ్యులు ఎంత నచ్చచెప్పినా అతడ్ని పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అంది. దాంతో పెళ్లిమండం కాస్తా రణరంగమే అయింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో రసాభాసగా మారింది. పాపం, పెళ్లి చేసుకోకుండానే పెళ్లికొడుకు అనిల్ కుమార్ వెనుదిరగక తప్పలేదు.