రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరలను ఒకేసారి రూ.30కి పెంచిన రైల్వే శాఖ
- ప్లాట్‌ఫాం టికెట్ ధర ఇప్పటివరకు రూ.10
- రూ.20 పెంచుతూ నిర్ణయం
- పెంచిన ధరలు వెంటనే అమల్లోకి
- లోకల్ రైళ్లలో కనీస చార్జీ రూ.30
మరోవైపు, లోకల్ రైళ్ల టికెట్లను కూడా భారీగా పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లోకల్ రైళ్లలో కనీస చార్జీ రూ.30గా నిర్ణయించారు. దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోతోన్న నేపథ్యంలో అనవసర ప్రయాణాలకు అడ్డుకట్ట వేయడానికి చార్జీలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ చెప్పుకొచ్చింది. లోకల్ రైళ్లు, ప్లాట్‌ఫాంపై ఎక్కువ మందిని ప్రోత్సహించకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.